మలయాళ చిత్రం హిందీలో
మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో మలయాళంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఒడియన్‌’. ఓ మనిషి వివిధ రకాల మనుషులుగా, ఇతర ప్రాణులుగా మారిపోతుంటాడు. అదే ఈ చిత్ర కథ. ఇందులో మోహన్‌లాల్‌ వివిధ రకాల జంతువుల రూపాల్లోకి మారిపోతుంటాడు. 30 నుంచి 65 మధ్య వయసున్న వ్యక్తులుగానూ రూపాంతరం చెందుతుంటాడు. విఏ శ్రీకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అజయ్‌దేవ్‌గణ్స్‌ విఎఫ్‌ఎక్స్‌ కంపెనీ విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందిస్తోంది. ఈ చిత్రంలో మంజు వారియర్‌, ప్రకాష్‌రాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబరు 11న విడుదల చేయనున్నారు. హిందీలో అనువాదం చేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.