ఐపీఎస్‌ అధికారిగా మమతా మోహన్‌దాస్‌!

ప్రముఖ దక్షిణాది నటి మమతా మోహన్‌దాస్‌ తనదైన రీతిలో ఓ కొత్త పాత్రలో దర్శనమివ్వబోతుంది. ప్రస్తుతం మలయాళంలో అఖిల్‌ పాల్‌ - అనాస్‌ ఖాన్‌ దర్శకత్వంలో క్రైం థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ఫోరెన్సిక్‌’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో మమతా ఐపీఎస్‌ అధికారి రితికా జేవియర్‌ పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ ఫోస్టర్‌ ఒకటి విడుదలై ఆకట్టుకుంటోంది. జీవీఎస్‌ ప్రొడక్షన్స్, రాగమ్‌ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవీస్‌ జేవియర్, సిజ్జు మ్యాథ్యులు నిర్మాతలుగా వ్యవవహరిస్తున్నారు. మమతా తెలుగులో ఎన్టీఆర్‌ సరసన ‘యమదొంగ’లో నటించి మెప్పించింది. ఆ తరువాత నాగార్జున ‘కింగ్‌’, కేడీ’, వెంకటేష్‌ నటించిన ‘చింతకాయల రవి’ చిత్రంలో నటించి అలరించింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.