యుద్ధ వీరుడిగా మారిన వెండితెర వైఎస్సార్‌
ఈ ఏడాది ‘యాత్ర’ బయోపిక్‌తో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మురిపించారు మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి. ఇప్పుడీయన ప్రధాన పాత్రలో మలయాళంలో ఓ భారీ చారితాత్మక చిత్రం రూపొందుతోంది. దీనికి ‘మమాంగం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు తొలుత సంజీవ్‌ పిü˜్లౖ దర్శకత్వం వహించగా.. కొన్ని కారణాల వల్ల ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఇప్పుడా పనిని దర్శకుడు ఎం.పద్మకుమార్‌ పూర్తి చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పోస్టర్‌లో మమ్ముట్టి యుద్ధ వీరుడిగా కత్తి, డాలు చేతబట్టి కదనరంగంలో కత్తి దూస్తూ చాలా పవర్‌ఫుల్‌గా దర్శనమిచ్చారు. 17వ శతాబ్దపు కాలం నాటి ‘మమాంకం’ అనే ఓ పండుగ చుట్టూ తిరిగే కథగా దీన్ని రూపొందించారు. ఈ పర్వదినం విషయంలో ఇద్దరు వీరుల మధ్య తలెత్తే వివాదాలు, దాని తాలుకూ పోరాటాల సమాహారంగా చిత్ర కథనం సాగుతుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.