సాయిధరమ్‌ తేజ్‌ నా వియ్యంకుడు: మంచు మనోజ్‌

మంచు మనోజ్‌ అనగానే సినిమాల్లో అల్లరి పనులు చేసే చిలిపి కుర్రాడు మనకు గుర్తొస్తుంటాడు. మనసులో ఎటవంటి తారతమ్యాలు ఉండవని చిత్రసీమలో అనుకుంటుంటారు. తాజాగా ఆయన తన సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి దిగిన ఫోటోలను ట్విట్టర్లో పెట్టాడు. అన్నట్టు వీరితో పాటు రెండు కుక్కలు ఉన్నాయి. వీటి గురించి మనోజ్‌ స్పందిస్తూ..ఇక్కడున్న టాంగో - జోయాలు డేటింగ్‌లో ఉన్నాయి. అయినా కూడా తమ వంతు బాధ్యతగా సామాజిక దూరం పాటిస్తూన్నాయి. ఇలాంటి మంచి అల్లుడిని ఇచ్చినందుకు వియ్యకుండు సాయిధరమ్‌ తేజ్‌కి ధన్యవాదాలు. అంతేకాదు త్వరలోనే టాంగ్‌ - జోయాలకు ముహూర్తాలు పెట్టి శుభలేఖలు వేయిస్తాం అంటూ సరదాగా వ్యాఖ్యలు జోడించాడు. సినిమాల్లో ప్రతినాయకులను చితగొట్టే మంచు మనోజ్‌ నిజజీవితంలో చాలా జోయల్‌గా ఉంటాడు. అందుకు నిదర్శనమే ఇలాంటి ఫన్నీ ఫోటోలు అంటూ కొంతమంది నెటిజన్లు సరదగా మాట్లాడుకుంటున్నారు. మనోజ్‌ ప్రస్తుతం ‘అహం బ్రహ్మాస్మి’ అనే చిత్రంలో్ నటిస్తున్నారు. రౌద్రం, కోపం, ప్రశాంతత.. ఇలా మూడు పార్శ్వాలుంటాయి కానీ నాది ఒకటే లుక్కు ఒకటే. కొందరు అనుకుంటున్నట్టుగా ఇందులో అఘోరాగా మాత్రం కనిపించడం లేదట మనోజ్‌.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.