పరీక్షలే గమ్యాన్ని నిర్దేశించవు: దర్శకుడు మారుతి

సినిమా దర్శకులు, నటులు  విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకు నడుంకట్టారు. ఇటీవల వెల్లడించిన ఇంటర్మీడియేట్‌ పరీక్షాఫలితాల్లో ఆశించిన ఫలితాన్ని సాధించని విద్యార్ధులు కొందరు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనల పట్ల స్పందించిన యువ దర్శకుడు మారుతి, నటుడు మంచు విష్ణు ట్విట్టర్‌ వేదికగా సందేశాన్నిచ్చారు. ‘‘ మనలోని ప్రతిభను, భవిష్యత్తును పరీక్షలు నిర్ణయించవు..నేను కూడా చదువులో వెనుక బెంచి విద్యార్థినే..యానిమేషన్‌ తదితర అంశాల్లో ప్రతిభతో టాపర్‌గా నిలిచాను. కానీ అవేవీ నన్ను దర్శకుడిగా తీర్చిదిద్దలేదు. దర్శకుడిని అవ్వాలనే నాలోని తపన పట్టుదల, అసక్తే నన్ను దర్శకుడిగా నిలిపాయి. విద్యార్ధులు మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకోండి. తల్లి తండ్రులూ పిల్లలకు జీవితంలో ఎలా బ్రతకాలో నేర్పండి వారిపై ఒత్తిడి పెంచకండి’’ అని మారుతి రాశారు. విద్య  వ్యవస్థ మారాలని విష్ణు రాసారు . ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థులకు సంతాపం ప్రకటించారు.






Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.