అటు ఎన్టీఆర్‌.. ఇటు చిరు.. మత్తు వదిలించే చిత్రం
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌ సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. నూతన నటీనటులతో ఓ చిత్రానికి శ్రీకారం చుట్టింది. రితేష్‌ రానా అనే కొత్త దర్శకుణ్ని పరిచేస్తూ ‘మత్తు వదలరా’ అనే సినిమాను నిర్మిస్తుంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. చాలా ఆసక్తికరంగా రూపొందించారు ఈ పోస్టర్‌ను. ఇందులో అలనాటి అగ్ర నటుడు ఎన్టీఆర్, మరోవైపు టెలివిజన్‌లో ప్రముఖ కథానాయకుడు చిరంజీవి కనిపిస్తారు. అలారంపై ‘మత్తు వదలరా’ అని చిత్ర టైటిల్‌ని రూపొందించారు. ఫ్లాట్‌ నంబరు 401, కస్టమర్‌ ఈజ్‌ గాడ్‌.. గాడ్‌ ఈజ్‌ గ్రేట్‌ అనే సూక్తితో పోస్టర్‌ను ఆసక్తిగా మలిచారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.