షూటింగ్‌లో అపశ్రుతి.. గాయాలపాలైన నాగశౌర్య
యువ హీరో నాగశౌర్య తాజాగా ఓ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రస్తుతం శౌర్య కథానాయకుడిగా ఐరా క్రియేషన్స్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు రమణ తేజ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ విశాఖపట్నంలో జరుగుతోంది. ఈ షూట్‌లో భాగంగా తాజాగా యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా శౌర్య ప్రమాదానికి గురయ్యారు. ఆయన డూప్‌ లేకుండా ఓ యాక్షన్‌ సీన్‌లో పాల్గొంటూ.. 15 అడుగుల ఎత్తైన ఓ బిల్డింగ్‌ పైనుంచి కిందకు దూకారు. కానీ, సరైన ప్రదేశంలో ల్యాండింగ్‌ కాకపోవడంతో మోకాలికి తీవ్రంగా గాయమైంది. ఈ ఘటన జరిగిన వెంటనే శౌర్యను విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యులు ఆయనకు 25 నుంచి 30 రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.