మా పెద్ద పిల్లలు వీళ్లే అంటోన్న నమ్రత

మహేష్‌బాబు సతీమణి ఈ మధ్యకాలంలో తమ కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటోంది. ఈ మధ్యనే తనమామ అయినటుంటి కృష్ణ గురించి చాలా గొప్పగా చెప్పింది. అంతేకాదు మహేష్‌ను తొలిసారి చూడగానే మా అమ్మనాన్నలకు తెగనచ్చేశాడని కూడా చెప్పింది. తాజాగా మహేష్‌బాబు, గౌతమ్‌ కలిసి ఈతకొలనులో ఉన్న ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఆ ఫోటోకి ‘‘మా ఇద్దరు పెద్ద పిల్లలు ఈ లాక్‌డౌన్‌ సమయాన్ని చాలా బాగా గడిపారు..’’అంటూ పేర్కొంది. మహేష్‌బాబు నమత్రలు తొలిసారిగా కలిసి నటించిన చిత్రం ‘వంశీ’.  బి.గోపాల్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం విడుదలైన 5 సంవత్సరాల తరువాత వీరిద్దరు పెళ్లి చేసుకొన్నారు. వీరికి గౌతమ్‌, సితార ఇద్దరు పిల్లలు. ఇప్పుడు నమ్రతకు వీళ్లే ప్రపంచం.

View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) onCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.