సైకిల్‌పై సవారి చేస్తున్న సితార - గౌతమ్‌!
టాలీవుడ్ నటుడు మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కుటుంబం గురించి ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది. ఎంత సెలబ్రెటీ అయినా సరే తన కుమార్తె సితార, కుమారుడు గౌతమ్ పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆమె తమ ఇంట్లో జరిగే విషయాలను సామాజిక మాధ్యమాల ద్వారా తెలుపుతూ ఎప్పటికప్పుడు మహేష్‌ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా సితార - గౌతమ్‌ సైకిల్‌ తొక్కుతున్న ఓ అందమైన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ లాక్డౌన్ సమయంలో నమ్రత మహేష్ బాబులు తమ గురించి పిల్లల గురించి ఎన్నో సంగతులను పంచుకున్నారు. గౌతమ్‌ - సితార సైక్లింగ్‌ గురించి వీడియోలో స్పందిస్తూ.. నా ప్రేమ, ఆనందం అంతా నా పిల్లలు అంటూ పేర్కొంది. ప్రస్తుతం ఈ సామాజిక మాధ్యమాల్లో వైరలౌతోంది.


View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.