అలనాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి: నమ్రతా మహేష్‌

ప్రముఖ నటి మహేష్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌ సినిమాల్లోకి రాకముందు మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. 1993 మిస్‌ ఇండియా టైటిల్‌ గెల్చుకున్న నమ్రత మిస్‌ యూనివర్స్ పోటీల్లో ఆరోస్థానంలో నిలిచింది. తాజాగా నమ్రతా ఆనాటి ‌పాత మధురాలను గుర్తు చేసుకొంటూ త్రోబ్యాక్‌ థర్స్ డే సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ నాటి వీడియోను షేర్‌ చేసింది. ‘‘ఉరిమే ఉత్సాహం..రెక్కలు విప్పుకున్న సీతాకోక చిలుకల జీవితం ఒక్కసారిగా లభించింది. పెద్ద కలలు కనండి. మీరు సాధించలేని ఏమీ లేదు. ఇదే నాకు తెలిసిన మంత్రం. కలలు కనే ప్రతి అమ్మాయి, ఆ కలలను నిజం అయ్యేలా చూసుకోండి. అసాధ్యమంటూ ఏమీలేదు. కొన్ని సంవత్సరాల కిత్రం నన్ను గమ్మత్తైయిన ప్రశ్న అడిగారు. నేను సమాధానం చెప్పాను. మరీ మీ సమాధానం ఏమీటి? అంటూ నాటి అనుభూతులను గుర్తు చేసుకొంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో’’ పంచుకొంది. ప్రస్తుతం మిల్కీస్టార్‌ మహేష్ బాబుకు పరిపూర్ణ సతీమణీగా ఇద్దరు బిడ్డలకు తల్లిగా, ఓ గృహణిగా నమ్రతా తన బాధ్యతలను నెరవేరుస్తుంది. అంతేకాదు భర్తకు చేదోడువాదోడుగా సినిమా షూటింగులు, వాణిజ్య ప్రకటనలు, బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్‌ పనులతో బిజీగా ఉంది. లాక్‌డౌన్ కారణంగా భర్త మహష్‌బాబు, పిల్లలు గౌతమ్‌, సితారతో సరదాగా ఉంటూ తమ కుటుంబానికి చెందిన ముచ్చట్లను సామాజిక మాధ్యమాల్లో వీడియోలు, ఫోటోలు పెడుతూ సందడి చేస్తుంది.   

View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.