జగదీష్‌గా వస్తున్న నాని
వరూ ఊహించిన టైటిల్‌తో రాబోతున్నాడు యువ కథానాయకుడు నాని. శివ నిర్వాణ దర్శకత్వంలో ఆయన 26వ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఆ చిత్రానికే ఆసక్తికర పేరు పెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇంతకీ ఆ టైటిల్‌ ఏంటంటే? ‘టక్‌ జగదీష్‌’. ఈ చిత్రంలో నాని.. జగదీష్‌ అనే పాత్రలో కనిపించనున్నాడు. టైటిల్‌, ఇతర వివరాలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది చిత్ర బృందం. షైన్‌ స్ర్కీన్స్‌ పతాకంపై హరీశ్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. తమన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. 2020 ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం నాని మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘వి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.







Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.