నాని టక్‌ జగదీష్‌ షూటింగ్‌కి అంతరాయం

కరోనా భయపెడుతున్నా ఆగిపోయిన సినిమాలన్నీ మళ్లీ పట్టాలెక్కాయి. జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణల్ని షురూ చేశాయి ఆయా చిత్రబృందాలు. నాని నటిస్తున్న ‘టక్‌ జగదీష్‌’ కూడా పది రోజులపాటు హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకొంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఇంతలో మరోసారి ఆచిత్రానికి బ్రేక్‌లు పడ్డాయి. చిత్రబృందంలోని ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడమే అందుకు కారణం. సినిమా చిత్రీకరణ తాత్కాలికంగా నిలిచిందని సినీవర్గాలు ధ్రువీకరించాయి. కరోనాతో బాధపడుతున్న సాంకేతిక నిపుణుడు కోలుకున్నాక మళ్లీ చిత్రం పట్టాలెక్కుతుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.