డేంజరస్‌ నటి నటాషా సూరికి కరోనా

మాజీ మిస్‌ ఇండియా వరల్డ్, బాలీవుడ్ నటి నటాషా సూరికి కరోనా పాజిటివ్‌. తాజాగా తన గురించి మాట్లాడుతూ..నేను ఆగస్టు ప్రారంభం నుంచి అనారోగ్యంతో ఇంట్లోనే ఉండిపోయాను. అనుకోకుండా అత్యవసర పనిమీద ఆగస్టు 1న పూణె వెళ్లాను. ఇక నాతో పాటు సోదరి రూపాలి, మా బామ్మ కూడా ఉన్నారు. వారు కూడా అనార్యోంగా ఉన్నారు. ప్రస్తుతం మేమంతా క్రమంగా కోలుకుంటున్నాం. ప్రస్తుతం నేనున్న పరిస్థితి విచిత్రమైంది. నేను నటిస్తున్న డేంజరస్‌ చిత్రం ఆగస్టు 14న ఓటీటీ ద్వారా విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర ప్రచార కార్యక్రమాలు సాగుతున్నాయి. వాటి నుంచి తప్పుకోవల్సి వచ్చింది. దేవుని దయవల్ల త్వరలోనే మేమంతా కోలుకుంటాం. ప్రస్తుతం నేను శారీరకంగా బలహీనంగా ఉన్నా అలసిపోయినట్లు అనిపించినా, మానసికంగా చాలా ఉత్సాహంగా ఉన్నాను. డేంజరస్‌ గురించి ప్రేక్షకుల స్పందన కోసం వేచి చూస్తున్నాని చెబుతోంది. బిపాప బసు, కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌ కలిసి నటిస్తున్న చిత్రం డేంజరస్‌. ఈ చిత్రంలో నటాషా సూరి కరణ్‌ సింగ్‌ భార్యగా నటిస్తోంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.