పుట్టినరోజున...

నటుడు అని పిలిపించుకోవాలంటే అన్ని రకాల పాత్రలు చేయాలి. కథానాయకడిగానూ, ప్రతినాయకుడిగానూ, కీలక పాత్రల్లో ఏ భావ్వోద్వేగాన్ని అయిన సహజంగా పండించాలి. ఈ తరం నటుల్లో ఇలా అన్ని పాత్రలు పోషిస్తున్న నటుడు నవీన్‌ చంద్ర. కథానాయకుడిగా నటిస్తున్న సమయంలోనే ‘అరవింద సమేత వీర రాఘవ’లో ప్రతినాయకుడిగా అద్భుత నటన కనపరిచాడు. వెండితెరకు 2005 లోనే ‘సంభవామి యుగే యుగే’ సినిమాతో నటుడిగా పరిచయం అయినా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర చేసి వెండితెరపై గుర్తింపు తెచ్చుకోవటానికి ‘అందాల రాక్షసి’ వరకు ఎదురు చూడ్సాల్సి వచ్చింది. ఆ సినిమాలో అతని నటనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళంలో హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం బయోపిక్‌లు, ఉద్యమాల సినిమాల హావా నడుస్తుంది కాబట్టి ఆ నేపథ్యంలో వస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ రోజు నవీన్‌ చంద్ర జన్మదినం కానుకగా మా ‘కాకర్లపూడి వెంకట సీతారామారావు’కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో ఆయన విద్యార్థి నాయకుడిగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. పిడికిలి బిగించి ఉన్న లుక్‌లో నవీన్‌ కొత్తగా కనిపిస్తున్నాడు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.