‘ఛోలి కే పీచే’ పాటకు సరోజ్‌ ఖాన్‌ నాకు ధైర్యం చెప్పారు: నీనా గుప్తా

దివంగత కొరియాగ్రాఫర్‌ సరోజ్‌ ఖాన్‌ గురించి ప్రముఖ నటి డ్యాన్సర్‌ నీనా గుప్తా ఎంతో గొప్పగా చెప్పింది. కరోనా వైరస్‌ వల్ల ఆసుపత్రిలో చేరిన కొరియా గ్రాఫర్‌ సరోజ్‌ ఖాన్‌ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణం పట్ల బాలీవుడ్‌కి చెందిన అమితాబచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, కరీనా కపూర్‌, జాన్వీ కపూర్‌, అలియా భట్‌ ఇంకో చాలామంది నటీనటులు సానుభూతి వ్యక్తం చేసి నివాళులు అర్పించారు. తాజాగా సరోజ్‌ ఖాన్‌ మరణంపై నటి,డ్యాన్సర్‌ నీనా గుప్తా ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడుతూ..‘‘అది చోలీ కే పీచే క్యా హై’ హిందీ పాట మొదటి రోజు సెట్లో షూటింగ్‌ జరుగుతోంది. ఆ సమయంలో నెనెంతో ఆందోళన చెందాను. ఎందుకంటే ఈ పాటకి సరోజ్‌ ఖాన్‌తో పాటు మరో ఇద్దరు ప్రముఖులు కూడా నృత్యానికి రూపకప్పన చేశారు. మరోపక్క నటి మాధురీ దీక్షిత్‌,  నాకెమో భయమేస్తుంది. ‘చోలీ కే పీచే క్యా హై’ పాట గురించి సరోజ్‌ స్టెప్పులు వేసి చూపించింది. ఈ స్టెప్పులు నేను చేయలేను, నాకు నమ్మకం లేదని చెప్పా. అప్పుడు ఆమె నన్నాడిగారు ‘నీవేమి చేయగలవు’ అని,  అయితే వెంటనే నా కోసం కొన్ని స్టెప్పులను ప్రత్యేకంగా రూపొందిస్తానని హామీ ఇచ్చింది. దాంతో ఆ పాట స్టెప్పులు, నాకెంతో సులభం అయ్యాయి. తరువాత సరోజ్ ఖాన్‌‌ నా నుంచి ఏమీ ఆశిస్తుందో.. అందుకు అనుగుణంగా నేను అర్థం చేసుకున్నాను. నేనేమో మాధరి దీక్షిత్‌లాంటి డ్యాన్సర్‌ని కాదు. దాంతో నాకు చాలా ఈజీగా ఉండే కొరియాగ్రఫీని అందించింది సరోజ్‌. ఆ పాట ఎంత పాపులర్‌ అయ్యిందో అందరికి తెలిసిందే. ఆమెతో ఏదో చేద్దామనుకున్నాను. కానీ ఆ కల నెరవేరలేదు..’’అంటూ చెప్పకొచ్చింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.