సినీ నటుడు నాగబాబు కూతురి నిశ్చితార్ధ వేడుక


ప్రముఖ తెలుగు నటుడు చిరంజీవి సోదరుడు నాగబాబు తనయ నిహారిక కొణిదెల నిశ్చితార్ధం జొన్నలగడ్డ చైతన్యతో గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ఇరుకుటుంబాలకి చెందిన అతికొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. వివాహ వేడుకకు చిరంజీవి, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, చిరు అల్లుడు కల్యాణ్‌ దేవ్‌లు హాజరయ్యారు. అయితే ఫోటోలు గమనిస్తే నిహారిక బాబాయి పవన్‌ కల్యాణ్‌ మాత్రం ఫోటోల్లో కనిపించలేదు. ఇక చిరంజీవి నిశ్చితార్ధ వేడుకను దగ్గరుండి నిర్వహించారని చెప్పుకుంటున్నారు. నిహారిక - జొన్నలగడ్డ చైతన్య గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలను నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేసింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.