హనీమూన్‌కు టైం లేదు!

పెళ్లంటే ఎంత సందడి ఉంటుందో కొత్తగా చెప్పాల్సినవసరం లేదు. ఇక సినీ తారల వివాహమంటే దేవలోకమే చిన్నబోయేలా వేదిక ముస్తాబవుతుంది. కనీసం పదిరోజుల ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. అలాంటిది తన వివాహానికి కేవలం వారం రోజులు మాత్రమే విరామం తీసుకుంటానని అంటున్నాడు నిఖిల్‌. ఈ యువహీరోకు ఇటీవలే డా.పల్లవి వర్మతో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ జంట ఏప్రిల్‌ 16న పెళ్లిపీటలెక్కనున్నారు. ఈ కొత్తపెళ్లి కొడుకు ప్రస్తుతం ‘కార్తీకేయ 2’ చిత్రంతో తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. పెళ్లయిన మరుక్షణమే షూటింగ్‌ హడావుడిలో మునిగిపోతాడట. భార్యతో కలిసి హనీమూన్‌కు వెళ్లాలన్నా సమయం లేదంటున్నాడు నిఖిల్‌. ‘అర్జున్‌ సురవరం’ సినిమా థియేటర్లలోకి రావడానికి ఎంతో సమయం పట్టింది. అలాగా మరే సినిమానూ ఆలస్యం చేయకూడదన్న ఉద్దేశంతోనే నిఖిల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.