సుకుమార్‌తో.. నిఖిల్‌!!

క్రియేటివ్‌
జీనియస్‌ సుకుమార్‌ కలం నుంచి మరో సినిమా రాబోతోంది. చిన్న సినిమాలకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో సుకుమార్‌ రైటింగ్స్‌ అనే సంస్థను స్థాపించాడు సుక్కు. అందులోనే తను కథ సహకారం అందించి, తన దగ్గర దర్శకత్వ విభాగంలో ఉన్న వారికి అవకాశం కల్పిస్తుంటాడు. ఇంతకు ముందు ఈ సంస్థలో ‘కుమారి 21 ఎఫ్‌’, ‘దర్శకుడు’ వంటి సినిమాలోచ్చాయి. తాజాగా మరో సినిమాకు కథ అందించాడు సుకుమార్‌. ఈ శుక్రవారం ‘అర్జున్‌ సురవరం’తో పలకరించిన నిఖిల్‌ కథానాయకుడుగా ఇందులో కనిపించబోతున్నారు. పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోతుంది. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్ని వాసు నిర్మాతగా వ్యవహరించనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. మరి కొద్ది రోజుల్లోనే కథానాయిక నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నారు.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.