అనుష్క చేతుల్లోని ఆ ఫజిల్‌ రహస్యమేంటి?
‘భాగమతి’ హిట్‌ తర్వాత ఏడాది పాటు విరామం తీసుకున్న అనుష్క.. ఇప్పుడు కోన వెంకట్‌ నిర్మాణ సార్థథ్యంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిందే. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘నిశ్శబ్దం’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది చిత్ర బృందం. తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. రకరకాల రంగులు పులుముకున్న రెండు చేతులు 301 అనే సంఖ్యను చూపిస్తుండగా.. అందులో ఓ చేతికి తాళం బ్రేస్‌ లేట్‌లా వేలాడదీసి ఉంది. ఆ చేతుల బ్యాగ్రౌండ్‌లో పాడుబడిన ఓ పెద్ద ద్వారం దర్శనమిచ్చింది. మొత్తంగా చూస్తుంటే పొస్టర్‌ను ఓ ఫజిల్‌లా రూపొందించారు. ఇందులో అనుష్కకు జోడీగా మాధవన్‌ నటిస్తుండగా.. అంజలి, షాలిని పాండే కీలక పాత్రల్లో కనిపించనున్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.