గాయనిగా నిత్య

శ్రియ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గమనం’. సుజనా రావు దర్శకుడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఈ చిత్రంతో శ్రియతోపాటు యువ నాయిక నిత్య మీనన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. తాజాగా ఆమె ఫస్ట్‌లుక్‌ విడుదల చేసింది చిత్రబృందం. ఈ పోస్టర్‌లో క్లాసికల్‌ సింగర్‌గా దర్శనమిచ్చింది. సంప్రదాయ వస్త్రధారణలో ఓ మైక్‌ ముందు కూర్చుని పాడుతున్న చిత్రం ఆకట్టుకుంటుంది. శైలాపుత్రి దేవి అనే పాత్ర పోషిస్తుంది. రమేష్‌ కరుటూరి, వెంకీ పుషదాపు, జ్ఞాన శేఖర్‌ వీఎస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మాటలు: సాయి మాధవ్‌ బుర్రా, కూర్పు: రామకృష్ణ అర్రం. ఇటీవలే విడుదలైన శ్రియ లుక్‌కి మంచి స్పందన లభించింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.