తాత మీ రూపు కానరాక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది!

తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగిన నటుడు, తెలుగుతల్లి ముద్దుబిడ్డ దివంగత నేత నందమూరి తారక రామారావు. ఈ రోజు ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయన మనవడు జూనీయర్‌ ఎన్టీఆర్‌ భావోద్వేగభరితమైన మాటలను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది. మీ రూపు కానరాక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది. పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. మీరు లేని లోటు తీరనిది..’’అంటూ తన తాతను వేడకుంటున్నాడు. ఎన్‌.టి.ఆర్‌ జయంతి రోజున ప్రతి సంవత్సరం ఆయన సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించేవారు. ఈసారి కరోనా వైరస్‌ (లాక్‌డౌన్‌) కారణంగా తమ ఇంటివద్ద నుంచి తాతకు నివాళులు అర్పిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.