కోవిడ్‌-19 నుంచి కోలుకున్న దర్శకుడు రాజమౌళి

ప్రముఖ తెలుగు సినీ అగ్రదర్శకుడు రాజమౌళి కరోనా వైరస్‌ సోకడంతో గత కొన్నాళ్లుగా క్యారంటైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా రాజమౌళికి కరోనా పరీక్ష చేయగా నెగటివ్‌ వచ్చింది. దాంతో ఆయన కరోనా నుంచి భయటపడ్డారు. ప్రస్తుతం ఇదే విషయాన్ని రాజమౌళి ట్విట్టర్‌ ద్వారా తెలియజేస్తూ..‘‘రెండు వారాల కాలంలో క్యారంటైన్‌ సమయం పూరైయ్యింది. కోవిడ్‌ లక్షణాలు లేవు. నాతోపాటు కుటుంబంలో అందరికి నెగటివ్‌ వచ్చింది. అయితే ప్రస్తుతం మేం ప్లాస్మా దానం చేయడానికి అర్హులమో కాదో తెలియడానికి ఇప్పటి నుంచి మూడు వారాల పాటు వేచి చూడాలని వైద్యులు చెప్పారు..’’ అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'  చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత దానయ్యకు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.