అరవిందుడు నవ్వాడు!
మనకున్న తెలుగు కథానాయకుల్లో అగ్రశ్రేణి నటుల్లో ఒకరు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌. పంచ్‌డైలాగ్‌ల కింగ్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత’. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై చిత్రసీమలో పలు అంచనాలు మొదలైయ్యాయి. ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్‌ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. వినాయకచవితి పర్వదినాన్ని పురష్కరించుకుని చిత్రబృందం తారక్‌ పోస్టర్‌ విడుదల చేసింది. ఆ పోస్టర్లో ఎన్టీఆర్‌ ఒక వైపు తిరిగి నవ్వుకుంటున్నాడు. చిత్ర ఆడియోను సెప్టెంబర్‌ 20న విడుదల చేయనున్నారు. ఈ ఫొటో తారక్‌ అభిమానులను అలరిస్తోంది. హారిక-హాసిని క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈచిత్రానికి సంగీతం తమన్‌. ఇంకా ఈచిత్రంలో పూజాహెగ్డే, సునీల్‌ నటిస్తున్నారు. రాధాకృష్ణ నిర్మాత.

                                                                                   Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.