ఓటీటీలోనే అలరిచేందుకు సిద్ధం

వేసవిలో అన్ని సీజన్ల కంటే ఎక్కవ వినోదం దొరుకుతుంది. ఓ వైపు ఆటలు, మరోవైపు సినిమాలు. పిల్లలతోపాటు పెద్దలు సెలవుల్లో ఈ రెండిటిని వీక్షిస్తూ ఆనందంగా గడిపేవారు. కానీ కరోనా మహమ్మారి వల్ల ఈ ఏడాది అన్నీ తారుమారయ్యాయి. ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. అధిక వ్యయంతో నిర్మించిన చిత్రాలు సైతం విడుదలకు నోచుకోలేదు. ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌)లో విడుదల చేద్దామంటే చేసిన శ్రమకు ఫలితం దక్కదనే భావన కొందరిది. అందుకే ఎంత ఆలస్యమైనా కొన్ని చిత్ర బృందాలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించేందుకు ఎదురుచూస్తున్నాయి. మరికొన్ని మాత్రం లాభాలు రాకపోయినా నష్టపోకుండా ఉంటే చాలని ఓటీటీ సంస్థల్ని సంప్రదిస్తున్నాయి. వాటితో ఒప్పందం చేసుకుని ఆన్‌లైన్లో విడుదల చేసేందుకు సిద్ధం అయ్యాయి. ఈ చిత్రాలేంటో చూద్దాం....


1. పెంగ్విన్‌ (తెలుగు, హిందీ) : జూన్‌ 19

2.శకుంతల దేవి (హిందీ)

3..గులాబో సితార (హిందీ): ఏప్రిల్‌ 17

4.లా (కన్నడ): జూన్‌ 26

5.ఫ్రెంచ్‌ బిర్యానీ (కన్నడ) :జులై 24

6.పొన్‌మగళ్‌ వందన్‌ (తమిళ్‌) : మే 29

7.సుఫియం సుజాతాయాం (మలయాళం)



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.