ఇలాంటి ఫొటోలు చాలా ఉన్నాయి

కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌కు సంబంధించిన ఓ అపురూప చిత్రాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఆయన సోదరుడు, నటుడు నాగబాబు. ఇది పవన్‌ కాలేజీ రోజుల నాటి పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలా ఉంది. దీంట్లో పవన్‌.. నూనూగు మీసాలు, కొద్దిపాటి గడ్డంతో చాలా క్యూట్‌గా కనిపించారు. ఈ చిత్రాన్ని నాగబాబు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ.. ‘‘ఇలాంటి ఫొటోలు చాలా ఉన్నాయి. నా దగ్గర దాచనంతే..!’’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.