మార్పుకై ప్రయత్నించే వాడే అసలైన నాయకుడు

‘‘మార్పును తెచ్చేందుకు ప్రయత్నించే వాడే నిజమైన నాయకుడు’’ అంటున్నారు కథానాయకుడు రామ్‌ చరణ్‌ అన్నారు. తాజాగా విడుదలైన ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్ని ఉద్దేశిస్తూ శుక్రవారం తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు చరణ్‌. ‘‘గొప్ప నాయకుడు.. నాయకుడు అనిపించుకోవాలి అనుకోడు. మార్పును తీసుకొచ్చేందుకు ప్రయత్నించే వాడే నిజమైన నాయకుడు. పదవి ఏంటనేది ముఖ్యం కాదు, లక్ష్యం ఏంటనేదే ముఖ్యం. జనసేన పార్టీ, పవన్‌ కల్యాణ్‌ గారికి మద్దతుగా ఉండి, సేవ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అంటూ ఏపీ ఎన్నికలు 2019 అనే హ్యాష్‌ట్యాగ్‌ను రామ్‌ చరణ్‌ జత చేశారు. ఇటీవల జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ రెండుచోట్ల పోటీచేసి కూడా ఓటమిపాలయ్యారు. భీమవరంలో వైకాపా అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌ చేతిలో పవన్‌ సుమారు 2 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోగా.. గాజువాకలో వైకాపా అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి చేతిలోనూ పరాజయం పాలయ్యారు. భారీ అంచనాల మధ్య ఎన్నికల బరిలో దిగిన ఆ పార్టీ కేవలం ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.