ఇకపై పవన్‌కి సినిమాలెందుకు అనకండి

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు సినీప్రియుల్లో ఎంతటి ఆదరణ ఉందో.. సినీ వర్గాల్లోనూ అంతే క్రేజ్‌ ఉంది. చిత్ర పరిశ్రమలోనూ ఆయన్ని దైవంగా కొలిచే తారలు.. దర్శక, నిర్మాతలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో దర్శకుడు హరీష్‌ శంకర్‌ కూడా ఒకరు. తాజాగా పవన్‌ కరోనా బాధితుల సహాయార్థం రూ.2కోట్ల భారీ విరాళం ప్రకటించిన నేపథ్యంలో ఓ అభిమానిగా హరీష్‌.. పవన్‌పై తరచూ విమర్శలు చేసే వారిపై తనదైన శైలిలో కౌంటర్‌ పేల్చారు. ‘‘ఇంకా సినిమాలెందుకు అని అనకండి.. కొంతమందికి సినిమా అవసరం.. కొంతమంది సినిమాకి అవసరం’’ అంటూ పవన్‌ గొప్పతనాన్ని తెలియజేసేలా ఆయన విరాళం ప్రకటించిన ట్వీట్‌ను తన ఖాతాలో రీట్వీట్‌ చేస్తూ అదిరిపోయే రీతిలో సమాధానమిచ్చారు హరీష్‌. ఇప్పుడీ ట్వీట్‌కు నెట్టింట పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు వస్తున్నాయి.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.