‘పింక్‌’ సెట్‌లో పవన్‌.. నెట్టింట వైరల్‌!!

పవన్‌ కల్యాణ్‌ ‘పింక్‌’ రీమేక్‌లో నటిస్తున్నాడని తెలిసినప్పటి నుంచి సినీ అభిమానుల్లో ఆసక్తి అంబరాన్నంటింది. ఎప్పుడు మొదలవుతుందా అనే నిరీక్షణ ఫలించింది. సోమవారం నుంచి ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. చిత్ర బృందం నుంచి అధికారికంగా ఫోటోలు విడుదల కానప్పటికీ పవన్‌ సెట్స్‌లో అడుగుపెట్టిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో పవన్‌ నల్లని దుస్తుల్లో దర్శనమిచ్చాడు. ఓ చిన్న దుకాణం ముందు నడుచుకుంటూ వెళ్తుంటాడు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రంలో పవన్‌ సరసన నటించే అవకాశం ఏ కథానాయిక దక్కించుకుందో తెలియాలంటే కొన్ని రోజుల ఆగాల్సిందే. బోనీ కపూర్, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.