‘బ్యాచ్‌లర్‌’ కోసం బుట్టబొమ్మ..

సుధీర్ఘ విరామం అనంతరం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రం పునఃప్రారంభమైంది. అఖిల్‌ అక్కినేని కథానాయకుడుగా బొమ్మరిల్లు భాస్కర్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. చిత్రీకరణలో కథానాయిక పూజా హెగ్డే పాల్గొంది. లాక్‌డౌన్‌ తర్వాత ఈ చిత్ర షూటింగ్‌ కోసం ఇటీవలే హైదరాబాద్‌ వచ్చింది పూజా. చిత్రీకరణకు హాజరైన ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. స్టైలిష్‌ లుక్‌లో దర్శనమిచ్చి అభిమానుల్ని అలరిస్తుంది.గీతా ఆర్ట్స్‌ 2 పతాకంపై బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంతోపాటు ప్రభాస్‌ సరసన ‘రాధేశ్యాం’లోనూ నటిస్తుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.