ఆ విషయంలో తొలి భారతీయ చిత్రంగా ‘ప్రభాస్‌ 20’

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే నాయిక. యువీ క్రియేషన్స్‌ పాన్‌ ఇండియాగా చిత్రంగా తెరకెక్కిస్తోంది. ‘ప్రభాస్‌ 20’ వర్కింగ్‌ టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి సినిమాటోగ్రాఫర్‌ మనోజ్‌ పరమహంస సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ఆసక్తికర విషయం తెలిపాడు. వర్చ్యువల్‌ ప్రొడక్షన్‌లో షూటింగ్‌ చేస్తున్నామని, ఈ విధానంలో చిత్రీకరణ జరుపుకుంటున్న తొలి భారతీయ చిత్రమిదే అని వివరించాడు. దానికి సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇంతకీ వర్చ్యువల్‌ పొడ్రక్షన్‌లో ఎలా చిత్రీకరిస్తారో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి...Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.