శుభవార్త వినిపించారు

ఓవైపు ప్రపంచమంతా కరోనా దెబ్బకు గజగజలాడుతున్నా.. ‘ప్రభాస్‌ 20’ బృందం మాత్రం ధైర్యంగా తమ కొత్త చిత్రాన్ని పూర్తి చేసే పనిలో పడిపోయింది. ప్రభాస్, పూజా హెగ్డే నాయకానాయికలుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గోపీకృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం జార్జియాలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో భాగంగా ప్రభాస్, పూజ, ప్రియదర్శి తదితర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ షెడ్యూల్‌ను విజయవంతంగా ముగించినట్లు దర్శకుడు ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. దీంతో పాటు సినీప్రియులకు ఓ శుభవార్తను వినిపించారు. ‘‘మరో షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయింది. ఇదింత వేగంగా పూర్తవడంలో సహాయ సహకారాలు అందించిన జార్జియన్‌ బృందానికి కృతజ్ఞతలు. మీరెంతో ప్రియమైన వ్యక్తులు. ‘ప్రభాస్‌ 20’ ఫస్ట్‌లుక్‌ త్వరలో..’’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు రాధాకృష్ణ. ఉగాది కానుకగా ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు సమాచారం. యురోప్‌ నేపథ్యంగా సాగే ఓ వైవిధ్యమైన ప్రేమకథతో చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ‘ఓ డియర్‌’, ‘రాధే శ్యామ్‌’ అనే పేర్లు పరిశీలినలో ఉన్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.