‘కబీర్‌ సింగ్‌’ టీజర్‌పై ప్రభాస్‌ ఆసక్తికర కామెంట్‌

తెలుగు వెండితెర సంచలనం ‘అర్జున్‌ రెడ్డి.. బాలీవుడ్‌లో ‘కబీర్‌ సింగ్‌గా రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. మాతృకను తెరకెక్కించిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగానే హిందీ వెర్షన్‌ను రూపొందిస్తున్నాడు. షాహిద్‌ కపూర్‌ - కియారా అడ్వాణి జంటగా నటించారు. ఇటీవలే ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. తెలుగు స్క్రిప్టులో ఎలాంటి మార్పులు చేయకుండా హిందీ చిత్రాన్ని తీసినట్లు టీజర్‌ను బట్టి తెలిసింది. దేవరకొండ లాగే షాహిద్‌ కూడా తన పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోయారని విమర్శకులతో పాటు సినీ ప్రియుల ప్రశంసించారు. ఇదిలా ఉండగా తాజాగా డార్లింగ్‌ ప్రభాస్‌ కూడా ఈ టీజర్‌పై తన అభిప్రాయాన్ని తెలియజేశారట. ఈ విషయాన్ని ఆయన హెయిర్‌ స్టైలిస్ట్‌ అలీమ్‌ హకీమ్‌ చెప్పారు. ప్రభాస్‌ ఫోన్‌లో దాదాపు ఏడు నిమిషాలు షాహిద్‌తో మాట్లాడారని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ.. ‘‘‘సాహో’ సినిమా షూటింగ్‌ కోసం నేను ప్రభాస్‌తో కలిసి హైదరాబాద్‌లో ఉన్నా. ‘కబీర్‌ సింగ్’ టీజర్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ప్రభాస్‌ దాన్ని చూసి.. నచ్చిందని చెప్పారు. టీజర్‌ పట్ల ప్రభాస్‌ కనబర్చిన ఆసక్తి చూసి.. నేను షాహిద్‌కు ఫోన్‌ చేసి, ఆయన చేతిలో పెట్టా. ప్రభాస్‌ షాహిద్‌ను ప్రశంసించారు. ఒరిజినల్‌ కంటే ‘కబీర్‌ సింగ్‌’ ఇంకా ఉత్తమంగా ఉందని అన్నారు. దాదాపు ఏడు నిమిషాలు ఇద్దరు మాట్లాడుకున్నారు’ అని తెలిపారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.