ట్విట్టర్లో ఊపేస్తున్న ‘రాధేశ్యామ్’‌ ఫస్ట్ లుక్‌


యంగ్‌ రెబల్‌ స్టార్‌ ‘సాహో’ నటుడు ప్రభాస్‌ , రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’‌ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ ఫస్ట్ లుక్‌ పోస్టర్ని చిత్రం బృందం జులై 10న విడుదల చేసింది. ఫస్ట్‌ లుక్‌ - టైటిల్‌ పోస్టర్‌ విడుదలైన 24 గంటల్లోనే 6.3 మిలియన్ల ట్వీట్లతో, ట్విట్టర్‌లో సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాకి సంబంధించి చిత్రీకరణ ఇప్పటికే 70 శాతంపైగా పూర్తి చేసుకొంది. చిత్రాన్ని వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో నటీనటులుగా జగపతిబాబు, సత్యరాజ్‌, భాగ్యశ్రీ, జయరాం, మురళీ శర్మ ప్రియదర్శి తదితరులు నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.