తొలి తెలుగు చిత్రంగా ‘సాహో’ రికార్డు!

ప్రభాస్‌ నటించిన ‘సాహో’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ముందుస్తు విడుదల వేడుక, ప్రోమోషన్లు ఓ రేంజ్‌లో నిర్వహించింది చిత్ర బృందం. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌ అంచనాలు పెంచేస్తుంది. పారిస్‌లోని ది గ్రాండ్‌ రెక్స్‌ థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న ప్రభాస్‌ రెండో సినిమాగా రికార్డు సాధించింది. అంతటితో ఆగకుండా తాజాగా మరో ఘనత దక్కించుకుంది. ఏంటంటే.. ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌ పాపులరైన చిత్రాలకు సంబంధించి ఎమోజీలు క్రియేట్‌ చేస్తుంటుంది. లయన్‌ కింగ్, అవెంజర్స్,స్పైడర్‌ మ్యాన్‌.. వంటి సినిమాల ఎమోజీ గతంలో తయారుచేసింది. ఇప్పుడు ఆ జాబితాలో ‘సాహో’ చేరింది. ట్విటర్‌ ఎమోజీ పొందిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది ‘సాహో’. ఇందులో ప్రభాస్‌ గాగుల్స్‌ పెట్టుకుని సీరియస్‌ లుక్‌లో ఉంటాడు. ఇది చూసిన అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.