ప్రభాస్‌ కొత్త చిత్రం పేరు తెలిసేది అప్పుడే!

‘బాహుబలి’ నటుడు ప్రభాస్‌ గత ఏడాది ‘సాహో’ చిత్రంతో సందడి చేశారు. ఆ తరువాత తన 20వ సినిమా రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసినిమాకి సంబంధించి ప్రభాస్‌ ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిట్‌ ఎంటో ఇప్పటి వరకు తెలియదు. ఈ నెల పదోతేదీ ఉదయం పది గంటలకు సినిమా టైటిట్‌తో పాటు ఫస్ట్ లుక్‌ ఆవిష్కరించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోంది. యూరోప్‌ నేపథ్యంలో సాగే ఓ సరికొత్త పీరియాడికల్‌ ప్రేమ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే సినిమా చిత్రీకరణ కొంతమేర పూర్తి చేసుకున్నవిషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ‘ఓ డియర్‌’, ‘రాధే శ్యామ్‌’ అనే పేర్లను పరిశీలనలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా టైటిల్‌ ఎంటో తెలుసుకోవాలంటే జులై 10 వరకు ఆగాల్సిందే మరి!


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.