ప్రకృతికి గొంతుకవ్వడం గర్వంగా ఉంది...

ఇప్పటికీ మనందరం ఎన్నో రకాల కథలు విని ఉంటాం... మనదేశంలోని అందమైన అడవుల్లో, అరుదైన కొండల్లో నివసించే జంతుజీవజాలాల కథ ఎప్పుడైనా విన్నారా? ఆ మూగ జీవులు వాగుల్లో, వంకల్లో ఎంత స్వేచ్ఛగా విహరిస్తాయో ఏ రోజైనా తెలుసుకున్నారా? ఇలా వాటి జీవితగాథను త్వరలో ‘వైల్డ్‌ కర్ణాటక’ పేరుతో తెలుగులో మనందరికీ వినిపించనున్నారు విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌. ఇది త్వరలో డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారం కానుంది. అంతేకాదు... ఈ కార్యక్రమం విశేషాలు తెలుపుతూ ‘ప్రకృతికి గొంతుకవ్వడం గర్వంగా ఉందం’టూ ట్విటర్‌లో ఓ పోస్ట్‌ కూడా పెట్టారు. దీనికోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నట్లు మహేష్‌బాబు ట్వీటారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.