ఆటోడైవ్రర్లకు సహాయం చేసిన ప్రణీత!

లాక్‌డౌన్‌ మొదలైన దగ్గర నుంచి ప్రముఖ నటి ప్రణీత సుభాష్‌ ఏదో ఒకరకంగా పేదవారకి సాయం చేస్తూనే ఉంది. తాజాగా ఈ అందాల భామ ఆటోడ్రైవర్లకు ప్రయాణికులకు మధ్య ఉండే అడ్డుతెరలను పంపిణీ చేసింది. ప్రస్తుతం నగరాల్లో ప్రభుత్వ రవాణాసౌకర్యం చాలా తక్కువగా ఉన్నాయి. ఆటోలను శ్రుభం చేసి మరీ జాగ్రత్తలు చెబుతోంది అత్తారింటికిదారేది చిత్ర నటి ప్రణీత. ఇప్పటికే కొన్ని తన అభిమాన సంఘాల ద్వారా పేదవారికి రేషన్‌ కూడా పంచింది. అందరూ సినీనటీనటుల్లాగ ఇంట్లోనే ఉండిపోకుండా బయటకు వచ్చి తనవంతుగా సాయం చేస్తున్నందుకు ప్రణీతపై సామాజిక మాధ్యమాల్లో తెగపొగిడేస్తున్నారు. తెలుగులో గత ఏడాది ‘ఎన్‌.టి.ఆర్‌: కథానాయకుడు’ చిత్రంలో కృష్ణకుమారిగా నటించి మెప్పించింది. ప్రస్తుతం ప్రణీత హిందీలో ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’, ‘హంగామా 2’ చిత్రాల్లో నటిస్తోంది. ప్రియదర్శన్‌ దర్శకత్వంలో హాస్యనేపథయంగా తెరకెక్కుతున్న ‘హంగామా2’లో శిల్పాశెట్టి, పరేష్‌ రావల్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 14న తెరపైకి రానుంది.

View this post on Instagram

A post shared by Pranitha Subhash ?? (@pranitha.insta) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.