‘అ!’ దర్శకుడి మరో క్రేజీ ప్రాజెక్ట్‌

వైవిధ్యభరిత కథా చిత్రాలకు పెట్టింది పేరు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ఆయన నుంచి వచ్చిన ‘అ!’కు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కగా.. యాంగ్రీస్టార్‌ రాజశేఖర్‌తో చేసిన ‘కల్కి’ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడిదే పంథాలో మరో ప్రయోగాత్మక చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు ఈ యువ దర్శకుడు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ కథా నేపథ్యంతో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్‌కి సంబంధించిన హింట్‌తో ఓ పోస్టర్‌ను బయటకొదిలారు ప్రశాంత్‌. దీన్ని బట్టీ చూస్తుంటే ఇది కరోనా వ్యాక్సిన్‌ చుట్టూ అల్లుకున్న కథగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు రేపు ఉదయం 9:00 గంటలకు విడుదలయ్యే ప్రీలుక్‌తో ఈ చిత్ర మరిన్ని విశేషాలు పంచుకోనున్నట్లు తెలియజేశారు.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.