పండగ చేసేందుకు వచ్చేశాడు!

యువ కథానాయకుడు మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ చేసేందుకు సిద్ధమయ్యాడు. రాశిఖన్నా కథానాయిక. కుటుంబ నేపథ్యంలో బంధాలు విలువలు తెలియజేసే చిత్రంగా తెరకెక్కుతుంది. తాజాగా ఈ చిత్రంలోని సాయి ధరమ్‌ తేజ్‌ ఫస్ట్‌ లుక్‌కు సంబంధించి మోషన్‌ పోస్టర్‌ విడుదల చేశారు.ఇందులో సాయితోపాటు ప్రముఖ నటుడు సత్యరాజ్‌ కనిపిస్తాడు. వర్షం పడుతుంటే సాయి తేజ్‌ రక్షణగా గొడుగు పట్టుకుంటే సత్యరాజ్‌ గొడుగును గాలికి ఎగరేసి వర్షాన్ని ఆనందిస్తుంటాడు. ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సంగీతం తమన్‌.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.