‘ఉరుమి’ నటుడు పృథ్వీరాజ్‌కి కరోనా పాజిటివ్‌

మళయాలి నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దాంతో ఆయన తనను కలిసి అందరిని పరీక్షలు చేయించుకోవాలంటూ సూచించారు. ప్రస్తుతం ఆయన ‘జన గణ మన’ అనే చిత్రం చేస్తున్నాడు. కోవిడ్‌ నిబంధనలు అనుసరించి ఈ సినిమా షూటింగ్‌ని జరుపుకుంటోంది. చివరి రోజున షూటింగ్‌లో పరీక్షలు చేశారు. దురదృష్టవశాత్తు కోవిడ్‌ పరీక్షలు చేయగా వాటిలో పృథ్వీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే అతనికి ఎటువంటి కరోనా లక్షణాలు లేవంట. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేస్తూ..‘‘ నేను ఈ ఏడాది అక్టోబర్‌ 7 తేదీ నుంచి ‘జన గణ మన’ సినిమా చిత్రీకరణలో ఉన్నాను. కేంద్ర ప్రభుత్వ విధానాలు, మార్గదర్శకాల ప్రకారం షూటింగ్‌ ప్రారంభించాం. చిత్రీకరణ ముందురోజు నుంచే అందరికి కరోనా పరీక్షలు చేయించాం. అయితే షెడ్యూల్‌ చివరి కోర్టుగది సెట్‌ చేసి షూటింగ్ చేశాం. అయితే తరువాత మరోసారి కరోనా పరీక్షలు చేయగా దురదృష్టవశాత్తు, ఈ సారి కరోనా పాజిటివ్‌గా తేలింది. నాకు ఎటువంటి కరోనా లక్షణాలు లేవు. అయినా బాగానే ఉన్నాను. నాతో కలిసిన ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోండి. త్వరలో తిరిగి కోలుకొని తిరిగిరావాలని ఆస్తున్నా’’ అంటూ తెలియజేశారు. పృథ్వీరాజ్‌ తెలుగులో ‘పోలీస్‌ పోలీస్’‌ అనే చిత్రంలో నటించారు. ఇందులో శ్రీరామ్, ఆహుతి ప్రసాద్‌, బ్రహ్మంనందం, కమలీని ముఖర్జీ తదితరులు నటించారు. ఆయన మలయాళంలో నటించిన ‘ఉర్మి’ చిత్రాన్ని తెలుగు ‘ఉరుమి’గా విడుదలై విజయం సాధించింది. ఇందులో జెనీలియా, నిత్యమేనన్‌, ప్రభుదేవాలు నటించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.