కన్నుగీటు సుందరి.. నయా అవతారం

చిన్న కన్నుగీటు సన్నివేశంతో రాత్రికి రాత్రే దేశంలో ఓ సెన్సేషనల్‌ సుందరిగా మారిపోయిన ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఇప్పుడీ ముద్దుగుమ్మ తనలోని మరో కోణాన్ని కూడా ప్రేక్షకులకు రుచి చూపించబోతుంది. ఇన్నాళ్లు తన కనుసైగలతోనే కుర్రాళ్ల గుండెల్ని కుదిపేసిన ఈ భామ.. ఇప్పుడు తన గళంతో కూడా గిలిగింతలు పెట్టబోతుంది. తాజాగా ఈ మలయాళ సుందరి ఓ మలయాళ చిత్రం కోసం తొలిసారి పాట పాడింది. ఓ వైవిధ్యమైన కథతో క్రీడా నేపథ్యంగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంకు కైలాష్‌ మేనన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో శ్రీరేఖ సాహిత్యమందించిన గీతాన్ని గాయకుడు నరేశ్‌ అయ్యర్‌తో కలిసి ఎంతో చక్కగా ఆలపించింది ప్రియా ప్రకాశ్‌. తాజాగా దీనికి సంబంధించిన టీజర్‌ను ప్రియా తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ‘‘నా తొలి ప్రయత్నాన్ని మెచ్చుకున్న మీ అందరికీ ధన్యవాదాలు’’ అంటూ సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో నితిన్‌తో ‘రంగ్‌ దే’లో, నానితో ‘గ్యాంగ్‌ లీడర్‌’లో కథానాయికగా నటిస్తోంది. ఇక ఈమె నటించిన తొలి బాలీవుడ్‌ మూవీ ‘శ్రీదేవి బంగ్లా’ విడుదలకు ముస్తాబవుతోంది.

View this post on Instagram

A post shared by Priya Prakash Varrier (@priya.p.varrier) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.