ఆయన బలవంతం వల్లే సినిమాల్లోకి..

మె
గాస్టార్‌ చిరంజీవి సినీకెరీర్‌కు ‘పునాది రాళ్లు’ చిత్రంతో పునాది వేశారు దర్శకుడు రాజ్‌కుమార్‌. ఆయన తాజాగా అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన తొలి చిత్ర దర్శకుడికి సంతాపం తెలియజేస్తూ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ సంతాప ప్రకటనలో చిరు ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘‘ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో రాజ్‌కుమార్‌ నన్ను కలిసి ‘పునాదిరాళ్లు’ సినిమాలో నటించాలని కోరారు. శిక్షణ పూర్తి కాకుండానే నటించడం ఎలా అని అడిగినప్పటికీ ఆయన ఒప్పుకోలేదు. చివరికి ఆయన బలవంతం మీదే ఆ సినిమాలో నేను నటించా. అదే నా నట జీవితానికి పునాదిరాళ్లు వేసింది. ఇటీవల కొంత కాలం క్రితం ఆయన మా ఇంటికి వచ్చి నన్ను కలిశారు. అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పడంతో అపోలో ఆస్పత్రికి పంపించి వైద్య పరీక్షలు చేయించడం జరిగింది. త్వరలో పూర్తి ఆరోగ్యంతో నన్ను కలవడానికి వస్తారనుకున్నా. ఆయన మృతి చెందడం చాలా బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని సంతాప లేఖలో పేర్కొన్నారు చిరు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.