ఇటలీకి వెళ్లనున్న ‘రాధేశ్యామ్‌’

‘సాహో’ ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’‌. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకుక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంది. పూజాహేగ్డే కథానాయికగా నటిస్తోంది. కరోనా వైరస్‌ కారణంగా చిత్ర షూటింగ్‌ వాయిదా పడింది. అయితే సినిమాకి సంబంధించిన చిత్రీకరణ కోసం చిత్రబృందం ఇటలీ వెళ్లనుంది. యూరోపియన్‌ ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న నేపథ్యంలోని సన్నివేశాల కోసం, సినిమా షెడ్యూల్లో భాగంగా 15 రోజుల పాటు ఇటలీలో చిత్రీకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. ఇటలీలో ఒకప్పుడు కోవిడ్‌-19 ప్రభావం చాలా ఉంది. గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మితమౌతోన్న సినిమాని 2021లో విడుదల చేయడానికి చిత్రనిర్మాణ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చిత్రంలో జగపతిబాబు, సత్యరాజ్‌, భాగ్యశ్రీ, జయరాం, మురళీ శర్మ, ప్రియదర్శి తదితరులు నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం ప్రభాస్‌ నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంతో పాటు హిందీలో ఓం రావత్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆదిపురుష్’‌లోనూ నటించనున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.