ముహూర్తం పెట్టారు!

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు శుభవార్త వినిపించబోతున్నారు.త్వరలోనే తన తదుపరి చిత్రం ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని బంధుమిత్రుల సమక్షంలో ప్రకటించేందుకు ముహూర్తం ఖరారు చేసి వారిని ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 9న ఉదయం గం.11.30ని.లకు కొత్త సినిమా విశేషాలు వెల్లడించేందుకు సిద్ధమయ్యారాయన. చాలాకాలం తర్వాత ఆయన నుంచి సినిమా వస్తుండటంతో ఆనందంలో ఉన్నారు సినీ అభిమానులు. అటు భక్తిరస చిత్రాలు, ఇటు రక్తికట్టించే సినిమాలు తెరకెక్కించే రాఘవేంద్రరావు ఈసారి ఏ నేపధ్యంలో సినిమా తీస్తారు? హీరో ఎవరు? అనే ఆసక్తి అప్పుడే మొదలైంది టాలీవుడ్‌ ప్రేక్షకుల్లో. నాగార్జున కథానాయకుడుగా తెరకెక్కించిన ‘ఓం నమోవెంకటేశాయ’ 2017లో విడుదలైంది. ఆ తర్వాత ‘ఇంటింటా అన్నమయ్య’ ప్రాజెక్టును పట్టాలెక్కించారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.