రోడ్‌ దర్శకుడు రజత్‌‌ ముఖర్జీ కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు రజత్‌ ముఖర్జీ ఇకలేరు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం జైపూర్లో కన్నుమూశారు. ఆయన వయసు యాభై సంవత్సరాలు. రామ్‌గోపాల్‌ వర్మ నిర్మించిన ‘రోడ్’‌ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో మనోజ్‌ బాజ్‌పేయి, వివేక్‌ ఒబెరాయ్‌, అంత్రమాలిలు నటించారు. ‘ప్యార్ ట్యూన్ క్యా కియా’, ‘లవ్ ఇన్ నేపాల్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన మృతి సందర్భంగా బాలీవుడ్‌కి చెందిన పులువరు ప్రముఖలు తమ సంతాప సానుభూతిని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. నటుడు మనోజ్‌ బాజ్‌పేయి ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘‘నా స్నేహితుడు అనారోగ్యంతో సుధీర్ఘంగా పోరాడుతూ కన్నుమూశారు. ఇక శాంతితో విశ్రాంతి తీసుకోండి. మనం మరలా కలుసుకోలేం. మీరెక్కడున్నా సంతోషంగా ఉండండి..’’అంటూ పేర్కొన్నారు.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.