అభిమాని కాలు పట్టుకున్న తలైవా...

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ని ఒక్క సారైనా చూస్తే చాలు అనుకునే వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. అందుకు ఆయన స్టైల్, సినిమాలు ఒక కారణం అయితే, ఆయన వ్యక్తిత్వం మరో కారణం. ఒక్క యాడ్‌తో కోట్లు సంపాధించే వీలు ఉన్నా, వందల కోట్లకు అధిపతి అయినా, సాధారణ పౌరుడిగా బతకటం ఆయనకే సాధ్యం. చిత్రీకరణ లేని సమయంలో కనీసం మేకప్‌ కూడా వేసుకోరు. ఆయన కనపడితే కాళ్ల మీద పడిపోయే అభిమానులు ఎందరో... అలాంటిది ఈ సూపర్‌ స్టారే ఓ అభిమాని కాళ్లు పట్టుకున్నాడు. ఎందుకంటే అతనికి రెండు చేతులు లేవు. కాళ్లతోనే తాను చేసుకోగలిగే పనులు అన్ని చేసుకుంటాడు. ఆ అభిమానితో కరచాలనం చేయటానికి రజిని అతని కాలు పట్టుకున్నాడు. ఆ సమయంలో తీసిన ఫోటోలతో సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తున్నారు తలైవా అభిమానులు. కేరళలోని పగఘూట్‌కు చెందిన ప్రణవ్‌ తలైవాని కలవాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు. ఈ విషయం తెలిసి రజినినే స్వయంగా అతనిని తన వద్దకు పిలిపించుకున్నాడు. ప్రణవ్‌ అద్భుతమైన ఆర్టిస్ట్‌ కూడా. సూపర్‌ స్టార్‌ మీద అభిమానంతో తన కాళ్లతోనే గీసిన స్కెచ్‌ను తలైవాకు బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడీ ఫోటోలు అంతర్జాలంలో సందడి చేస్తున్నాయి.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.