45 ఏళ్ల రజినిజం

ఇండియాలో చిత్ర సీమలో చెప్పుకోదగిన నటుల్లో మొదటి వరుసలో ఉండే కథానాయకుడు రజనీకాంత్‌. కె.బాలచందర్‌ దర్శకత్వంలో ‘అపూర్వా రాగంగల్‌’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేశారు. ఆగస్టు 15, 2020 నాటికి ఈ చిత్రం విడుదలై 45 సంవత్సరాలు అవుతోంది. రజనీకాంత్‌ నలభై ఐదు సంవత్సరాల సినీజీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ప్రముఖ మలయాళి నటుడు మోహన్‌లాల్‌ రజినీకాంత్‌ గురించి ట్విట్టర్లో స్పందిస్తూ..‘‘5 దశాబ్దాలు, 45 సంవత్సరాలు. యాన్‌ ఐడెంటిటీ, యాన్‌ ఐకాన్‌ ఆఫ్‌ ఇండియా సినిమా, మా ప్రియమైన సూపర్‌స్టార్‌ 45 సంవత్సరాల రజినిఇజం సీడీపీని విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది..’’అంటూ ట్విట్‌ చేశారు. ప్రస్తుతం 45YearsOfRajinism హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. రజనీకాంత్ బాలీవుడ్, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ సినిమాల్లో నటించారు. భారతీయ సినిమా తారల్లో సూపర్‌స్టార్‌గా పేరుపొందారు. ఇంకా సినిమారంగానికి చెందిన హీరోలు, హీరోయిన్లు, దక్షిణాదికి చెందిన దర్శకులు ‘45 సంవత్సరాల రజినిజం’ కోసం కామన్‌ డీపీని షేర్‌ చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సీడీపీలో సూపర్ స్టార్‌ రజిని పోషించిన పలు సినిమాల్లోని పాత్రలు ఉన్నాయి. వాటిలో ‘రోబో’, ‘శివాజీ’, ‘భాషా’ చిత్ర స్టిల్స్ ఉన్నాయి. అన్నికంటే డీపీ మధ్యలో ఉదయించే సూర్యుడితో రజినీ కాలర్‌ పట్టుకున్న ఫోటో ఆకట్టుకునేలా ఉంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.