ఇన్‌స్టాగ్రామ్‌లో దూసుకుపోతున్న రకుల్‌

ప్రముఖ నటి పంజాబి సుందరి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తన నటనతో తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకుల్ని మెప్పించింది. లాక్‌డౌన్‌ సమయంలో ఎన్నోరకాల వీడియోలను తన అభిమానులతో పంచుకుంది. నిత్యం ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో సందడి చేస్తున్న రకుల్ ఇప్పుడు ఓ కొత్త మైలురాయిని చేరుకుంది. తాజాగా ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ల ఫాలోవర్స్ ని సంపాదించింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్‌ చేసింది. ‘‘అసలు సోషల్‌ మీడియా గురించి నాకేం తెలియకుండానే నా పని చేసుకొంటూ ముందుకెళ్తున్నాను. కానీ మీరందరూ నాకెంతో సహాయసాకారాలు అందించారు. మీరు నాపై అపారమైన ప్రేమను కురిపిస్తున్నారు. ఈ ప్రేమను నేను ఎప్పటికి మర్చిపోను. మీకెంతో రుణపడి ఉంటాను. మీ అందరిని అలరించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని మాట ఇస్తున్నా. మీరు లేకపోతే నేను లేను. ఇక్కడ ఇంతమంది ఇన్‌స్టాగ్రామ్‌ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆనందమైన సంతోషమైన మీతోనే పంచేకుంటున్నాను..’’అంటూ పేర్కొంది. రకుల్ ప్రీత్‌సింగ్ ప్రస్తుతం కమల్‌హాసన్‌తో కలిసి ‘భారతీయుడు 2’ చిత్రంలో నటిస్తుంది. హిందీలో అజయ్ దేవ్‌గన్, సిద్దార్థ్ మల్హోత్రా కలిసి 'థాంక్స్ గాడ్' అనే హాస్య చిత్రంలో నటిస్తోంది. రకుల్ గత ఏడాది బాలీవుడ్‌లో అజయ్‌ దేవగణ్‌తో కలిసి ‘దే దే ప్యార్‌ దే’ చిత్రంలో నటించింది. తమిళ్లో ‘ఎన్‌జీకే’ చిత్రంలో సూర్య ప్రియరాలిగాను అలరించింది. ఇక తెలుగులో నాగార్జునతో కలిసి ‘మన్మథుడు2’లో అవంతిక పాత్రలో అదరగొట్టేసింది. ఈ సంవత్సరం ఆరంభంలో హిందీలో ‘సిమ్లా మిర్చి’ సినిమాలో నటించింది. చిత్రంలో హేమామాలిని కూతురు నైనాగా రకుల్‌ప్రీత్‌ అలరించింది. చిత్రంలో రకుల్‌, హేమామాలిని పాత్రలు ఒకే అబ్బాయిని ప్రేమించడం విశేషం.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.