మాల్దీవుల్లో హంగామా చేస్తున్న రకుల్‌

ప్రముఖ నటి రకుల్ ప్రీత్‌ సింగ్‌ దక్షిణాది చిత్రాలతో పాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ భామ కుటుంబంతో కలిసి మాల్దీవుల్లో విహారయాత్ర చేస్తుంది. అక్కడి సంగతులను సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ అలరిస్తుంది. ఓ ఫోటోను షేర్‌ చేస్తూ..‘‘విటమిన్‌ ‘డి’ని సముద్రం ఒడ్డునుంచి కూర్చుని పొందడం, వర్కౌట్స్ చేయడం చాలా బాగుంది..’’అంటూ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం రకుల్ ‘అటాక్‌’ చిత్రంలో నటిస్తుంది. యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రంలో జాన్‌ అబ్రహంతో పాటు జాక్విలిన్‌ ఫెర్నాండజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అర్జున్‌ కపూర్‌తో కలిసి సరిహద్దు ప్రేమకథా నేపథ్యంలో వస్తున్న ‘సర్దార్‌ అండ్ గ్రాండ్‌సన్’‌ చిత్రంలోనూ నటిస్తోంది. ఇక కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో వస్తున్న భారతీయుడు సీక్వెల్‌ చిత్రం ‘ఇండియన్‌2’లోనూ కనిపించనుంది. ఈ మధ్యే ‘మేడే’ అనే సినిమా ఒప్పుకుంది. ఇందులో రకుల్‌ ఫైలట్‌ పాత్ర పోషిస్తుంది. అజయ్‌ దేవగణ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌ కూడా నటించనున్నారు.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.