మూడు ఎఫ్‌ లు ఉంటే చాలు: రకుల్‌ప్రీత్‌

ఉత్తరాది నుంచి టాలీవుడ్‌కి వచ్చిన అందాల నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ‘‘పెళ్లంటే చాలామంది ఒక రకమైన ఒత్తిడికి లోనవుతున్నారు ఎందుకో అర్థం కావడం లేదంటోంది’’ రకుల్‌ప్రీత్‌ సింగ్.‌ తాజాగా తన వ్యక్తిగతం గురించి మాట్లాడుతూ..‘‘నాకు మన భారతీయ వివాహ వ్యవస్థపై చాలా నమ్మకం ఉంది. కానీ కొంతమంది పెళ్లంటే చాలు అదో విధమైన ఒత్తిడిగా భావిస్తున్నారు. నాకైతే ఏమీ అర్ధం కావడం లేదు. మనల్ని ప్రేమించిన వ్యక్తిని అదే విధంగా హృదయపూర్వకంగా ప్రేమిస్తుంటాం. నేను కూడా అలాంటిదాన్నే. ప్రేమంటే ఎంటో నా తల్లితండ్రుల  చూసి అర్థం చేసుకున్నాను. నాకు తెలిసి ప్రేమంటే అదో అనుభూతి...


ఎలాంటి వాడు కావాలంటే..

నేను ఎలాంటి వాణ్ని కోరకుంటానంటే..అతను చాలా పొడవుగా ఉండాలి. మంచి తెలివిగలవాడై ఉండాలి. నేను తల ఎత్తుకుని చూసేలా ఉండాలి. ఎదుటివారిని నొప్పించనివాడైతే ఇంకా బాగుటుంది.

చిత్రసీమలోకి ఎప్పుడు వచ్చానంటే..

నాకు నటించాలనే ఆశ ఉంది. అందుకే 18 ఏళ్ల వయసులోనే మోడలింగ్‌ చేశాను. అప్పట్నుంచే నాకు నటనపై చాలా బలమైన కోరిక ఉండేది. పాకెట్‌ మనీ కోసం సినిమా చేశాను. నేను తొలిసారిగా కన్నడ చిత్రంలో పనిచేశాను.

నా ప్రాధాన్యత దేనికంటే..

తొలుత చదువు పూర్తైయిన తరువాతే సినిమాలు చేద్దామనుకున్నా. అందుకే వచ్చిన కొన్ని సినిమాల అవకాశాలను తిరస్కరించాను. ఓ పక్క చదువు మరోపక్క సినిమాలు రెండింటికి సమయం సరిపోక పోవడంతో కొన్ని సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించాను.

అభిరుచి ఉన్న పనులు మాత్రమే..

అన్ని పనులు చేయడం కన్నా, అభిరుచి ఉన్న ఏదో ఒక పని మాత్రమే చేయగలను. అందుకే చిత్రసీమలోకి ప్రవేశించాను. నాకు ఇష్టమైనవి మూడు ‘ఎఫ్’‌లు. అవి, సినిమాలు, ఫిట్నెస్‌, ఆహారం. ఈమూడుంటే చాలు జీవితం అలా గడిచిపోతుంది.  Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.